ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోతు న్నాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటగా, రానున్న మూడు రోజుల్లో ఇవి మరో 1 నుంచి 2 డిగ్రీల మేర పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఎండలతో పాటు వడ గాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఉమ్మడి ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, నిజామాబాద్‌తో పాటు ఖమ్మం, మెదక్, మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరిక లు జారీ అయ్యాయి. ఈ జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 41 నుంచి 44 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉంది. గురువారం ఉమ్మడి ఆదిలాబాద్, నిజామా బాద్, ఖమ్మం, నారాయణ పేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వడగాలులు వీరి అవకాశం ఉంది. ఈరోజు ఉమ్మడి ఆదిలా బాద్ తో పాటు నాగర్ కర్నూల్, వనపర్తి, నారా యణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వడగాలుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంచనా. ఈ జిల్లాలకు 'ఎల్లో' హెచ్చరికలు జారీ చేశారు. మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు అత్యవస రమైతే తప్ప బయటకు రాకూడదని నిపుణులు సూచిస్తున్నారు. తగినంత నీరు తాగుతూ ఉండాలని, వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ విజ్ఞప్తి చేసింది.
Admin
E Nivas News