Thursday, 30 July 2026 08:13:57 AM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయండి..! పెండింగ్ బిల్లుల చెల్లింపుకు ప్రభుత్వం సిద్ధం

సీఎం రేవంత్ రెడ్డి

Date : 19 May 2026 09:17 PM Views : 75

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ ప్రక్రియ దగ్గరుండి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయించాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి పాలమూరు జిల్లా మంత్రులకు ఎమ్మెల్యేలకు స్వయంగా సూచించారు. మంగళవారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని మంత్రులు జూపల్లి కృష్ణారావ, వాకిటి శ్రీహరి, ప్రభుత్వ విప్ శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్, ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణరెడ్డి, మధుసూదన్ రెడ్డి, మేఘారెడ్డి, రాకేష్ రెడ్డి, వంశీకృష్ణ, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిరామకృష్ణారావు తదితరులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రత్యేకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారితో మాట్లాడినట్లు చైర్మన్ వీర్లపల్లి శంకర్ తెలిపారు. ఉమ్మడి పాలమూరు జిల్లా సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి పలు కీలక సూచనలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినట్లు వీర్లపల్లి శంకర్ తెలిపారు. జిల్లాలోని ఇతర ప్రాజెక్టులకు సంబంధించి వీలైనంత త్వరగా భూసేకరణ పూర్తి చేయాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. భూసేకరణ నిధుల విషయంలో జాప్యం జరగకుండా వెంటనే చెల్లింపులు జరిగేలా చూస్తామని సీఎం పేర్కొన్నారని ఆయన స్పష్టం చేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులపై జిల్లా మంత్రులు సంబంధిత జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించి ప్రాజెక్టుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాలోని ఇతర సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి మంత్రులు ఎమ్మెల్యేలు తీసుకెళ్లారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారని తెలిపారు. జిల్లాలో సమస్యల పరిష్కారం పనుల్లో పురోగతిపై మంత్రుల ఆధ్వర్యంలో తరచూ తనను కలవాలని సీఎం ఆదేశించినట్లు తెలిపారు. ఈ భేటీ సందర్భంగా ఎమ్మెల్యే, రాష్ట్ర భద్రత సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ సంతోషం వ్యక్తం చేశారు. యుద్ధ ప్రాతిపదికన పాలమూరు రంగారెడ్డి సాగునీటి ప్రాజెక్టు తీరుపై స్పందించి భూసేకరణ వాటికి చెల్లించాల్సిన బిల్లులతో పాటు పెండింగ్ బిల్లులను చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేయడం ఎంతో శుభ పరిణామం అని తెలిపారు. లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ నిర్మాణానికి ఒక్కొక్కటిగా సమస్యలు తీరిపోతున్నాయని వీర్లపల్లి శంకర్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి స్వయంగా ధన్యవాదాలు తెలియజేసినట్లు తెలిపారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :