Thursday, 30 July 2026 08:16:28 AM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

మంత్రపురిలో ఘనంగా భారీ బైక్ ర్యాలీ

Date : 27 April 2026 08:32 PM Views : 247

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : మంత్రపురి విరాట్ హిందూ సమ్మేళనం వేదికగా సోమవారం మంథని పట్టణంలో నిర్వహించిన భారీ బైక్ ర్యాలీ అత్యంత ఉత్సాహభరితంగా, విజయవంతంగా సాగింది. పాత ఇండియన్ పెట్రోల్ బంక్ నుండి ప్రారంభమైన ఈ ర్యాలీలో సుమారు 100 బైక్‌లపై హిందూ బంధువులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కేసరి ధ్వజాలతో, 'జై శ్రీరామ్' నినాదాలతో మంథని పురవీధులు మారుమోగాయి. ఈ సందర్భంగా కెక్కర్ల అనిల్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. హిందువులు సంఘటితంగా లేకపోవడం వల్లే, నాస్తికుల పేరుతో కొందరు హిందూ ధర్మాన్ని, పవిత్ర గ్రంథాలను విమర్శించే సాహసం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. "మనం కేవలం పుట్టుకతో హిందువులుగా ఉంటే సరిపోదు, ప్రతి హిందువులో హిందుత్వ భావజాలం ఉండాలి. హిందుత్వ వాదులుగా మేల్కొన్నప్పుడే ధర్మాన్ని రక్షించుకోగలం. హిందువులందరినీ ఒక్కతాటిపైకి తెచ్చేందుకే ఈ విరాట్ హిందూ సమ్మేళనం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.

*29న భారీ బహిరంగ సభ* ఈ నెల 29వ తేదీన మంథని కాలేజీ గ్రౌండ్స్‌లో నిర్వహించబోయే *"విరాట్ హిందూ సమ్మేళనం"* కార్యక్రమానికి హిందూ బంధువులందరూ వేలాదిగా తరలివచ్చి జయప్రదం చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రపురి విరాట్ హిందూ సమ్మేళనం సభ్యులు గర్రెపెల్లి వెంకటేశ్వర్లు, కొత్త శ్రీనివాస్, కనుకుంట్ల స్వామి , తూర్పాటి రాము, తోండ్ల సంతోష్, బొడ్డు సతీష్, మాడిశెట్టి సుదర్శన్, కొమురవెల్లి హరీష్, మాడిశెట్టి సురేందర్, చొప్పర రమేష్, కొండ తిరుపతి, రోడ్డ రాజేశ్వర్ రావు,దువ్వ తిరుపతయ్య చిలువేరి సతీష్, నాంపల్లి రమేష్ మరియు అధిక సంఖ్యలో యువకులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :