ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపక పోస్టులకు ఈ నెల 17న ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆర్ సి ఓ షేరు శ్రీధర్, ప్రిన్సిపల్ డాక్టర్ పురుషోత్తం లు తెలిపారు. సంబంధిత సబ్జెక్టులలో పీజీ లో 55 శాతం మార్పులు కలిగిన వారు అర్హులన్నారు. నెట్, సెట్ పీహెచ్డీ లతో బోధన అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు వారి యొక్క సర్టిఫికెట్లతో 17న కళాశాలలో నిర్వహించే డెమో క్లాసులకు హాజరు కావాలన్నారు.
Admin
E Nivas News