Thursday, 30 July 2026 08:15:11 AM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

ప్రభుత్వ గెజిట్‌లో ‘నేతకాని’ కుల పేరు సవరణ చేయాలి... మంత్రి వివేక్‌ను కోరిన నేతకాని సేవా సంఘం నాయకులు..

Date : 11 May 2026 08:39 PM Views : 83

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : నేతకాని (మహర్) సేవా సంఘం ప్రతినిధులు రాష్ట్ర కార్మిక, ఉపాధి, గనుల శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామిని సోమవారం కలిసి ప్రభుత్వ గెజిట్ మరియు అధికారిక రికార్డుల్లో “నేతకాని” కుల పేరును సరిచేయాలని విజ్ఞప్తి చేశారు.ప్రస్తుతం కొన్ని అధికారిక పత్రాలు, నమోదు ప్రక్రియల్లో “నేతకాని”కు బదులుగా “మలసాలె,నెట్కాని”గా నమోదు అవుతోందని, ఇది తప్పుగా నమోదవుతోందని సంఘం ప్రతినిధులు పేర్కొన్నారు. దీనివల్ల సమాజానికి చెందిన ప్రజలు పలుఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రాష్ట్ర అధ్యక్షుడు దుర్గం స్వామి, దుర్గం సిద్ధార్థ రామ్మూర్తి సమర్పించిన వినతిపత్రంలో నేతకాని కులానికి చెందిన ప్రజలు ఖమ్మం, మంచిర్యాల, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలతో పాటు రాష్ట్రంలోని సుమారు 35 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తరించి ఉన్నారని వివరించారు. అధికారిక రికార్డులు, గెజిట్ ప్రకటనలు, కుల ధృవీకరణ పత్రాల్లో “నేతకాని” పేరునే ఏకరీతిగా నమోదు అయ్యేలా షెడ్యూల్డ్ కులాల సంక్షేమ శాఖ అధికారులకు తగిన ఆదేశాలు ఇవ్వాలని వారు మంత్రిని కోరారు. ఈ సందర్భంగా మంత్రి స్పందిస్తూ సంబంధిత అధికారులతో ఈ విషయాన్ని చర్చించి అవసరమైన సవరణలు చేయించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :