Friday, 31 July 2026 06:21:36 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

అంబరాన్ని అంటినగణ తంత్ర దినోత్సవ వేడుకలు

రాజ్యాంగ విలువలతో సమగ్ర అభివృద్ధే లక్ష్యమని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

Date : 27 January 2026 08:24 AM Views : 147

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : జిల్లా కేంద్రంలోని డా బిఆర్ అంబేద్కర్ క్రీడా మైదానంలో సోమవారం నిర్వహించిన 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన కలెక్టర్ ముందుగా పోలీసులు, సాయుధ దళాలు, ఎన్ సీసీ గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకాన్ని ఆవి ష్కరించారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికీ జిల్లా కలె క్టర్ 77వ గణతంత్ర దినో త్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ 1950 జనవరి 26న భారతదేశం స్వతంత్ర, ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా అవత రించిన సందర్భంగా ఈ రోజును పండుగ వాతావరణంలో జరుపుకుంటున్నామని పేర్కొన్నారు. మన రాజ్యాంగాన్ని రచిం చిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్,రాజ్యాంగ సభ సభ్యుల కృషి అభినందనీ యమని,ప్రతి భారతీయు డికి సమాన హక్కులు,స్వే చ్ఛ,సమానత్వం కల్పించే గొప్ప రాజ్యాంగం మనదని కలెక్టర్ అన్నారు. స్వాతంత్ర్య సాధనలో ప్రాణత్యాగాలు చేసిన మహనీయులను స్మరించుకుంటూ జిల్లా అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం మహిళల జీవితాల్లో కీలక మార్పుకు దారితీసిందని తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు కోటి 85 లక్షల 97 వేల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేయగా, రూ.97.కోట్ల 43.లక్షలు మహిళలకు ఆదా అయిం దన్నారు. వైద్య ఆరోగ్య సేవ లుపేదలకు భరోసారాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వైద్య బీమా పరిమితిని ప్రభుత్వం 5.లక్షల నుండి 10 లక్షలకు పెంచినట్లు తెలిపా రు.జిల్లాలో 39,605 మంది ఈపథకం ద్వారా వైద్య సేవలు పొందగా రూ.88 కోట్ల 13 లక్షలు ఖర్చు చేసి నట్లు వెల్లడించారు. ఔషధి ద్వారా 1,03,402 మందికి వైద్య సేవలు, 5,690 మంది మహిళలకు ఆరోగ్య మహిళా క్యాంపులు, 65 పల్లె దవాఖానాలుఏర్పాటు చేశామని తెలిపారు. మహాదేవపూర్. కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో డయాలసిస్ సేవలు అందిస్తున్న ట్లు చెప్పారు. రైతు బరోసా పథకం ద్వారా ప్రతి సీజన్‌ కు ఎకరాకు రూ.6 వేలు పెట్టుబడి సాయం అంది స్తున్నామని తెలిపారు. జిల్లాలోని 1,24,496 మంది రైతులకు రూ.96 కోట్లు చెల్లించామని చెప్పారు. రైతుల ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు రూ.2.లక్షల రుణమాఫీ, రైతు బీమా పథకంలో 72,058 మంది నమోదు చేసినట్లు తెలిపారు. జిల్లాలో వ్యవసాయంతో పాటు అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్తు సరఫరా చేస్తున్నామని తెలిపారు. 46,840 ఉచిత వ్యవసాయ విద్యుత్తు కనె క్షన్లు, గృహాజ్యోతి పథకం ద్వారా 56,525 కుటుం బాలకు రూ.37 కోట్ల 42 లక్షలు ప్రభుత్వమే సబ్సిడీ చెల్లించినట్లు పేర్కొన్నారు. నిరుపేదలకు గౌరవ నివాసం ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద జిల్లాలో 3,943 ఇండ్లు మంజూరు, 3,180 ఇండ్లకు మార్క్అవుట్ ఇచ్చామని, ఇప్పటి వరకు రూ. 51 కోట్ల 40 లక్షలు విడుదల చేశామని తెలిపారు. పేదలకువరం మహాలక్ష్మి గ్యాస్ పథకం,ఈ పథకం ద్వారా 68,311 మంది కి రూ.500కే గ్యాస్ ఇస్తు న్నామని ఇప్పటి వరకు 2,36,243 సిలిండర్లు సరఫరా చేసిరూ. 6 కోట్ల 55 లక్షల సబ్సిడీ చెల్లించి నట్లు తెలిపారు. 277 రేషన్ దుకాణాల ద్వారా 1,37, 950 కార్డుదారులకు బియ్యం సరఫరా చేస్తున్నామని తెలిపారు. వానా కాలం పంట ద్వారా1,15, 853 మెట్రిక్ టన్నులధా న్యం కొనుగోలు చేసి రూ.2 74 కోట్లు చెల్లించామని, సన్న వడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తున్న ట్లు తెలిపారు. మహిళా శక్తి ద్వారా మహిళల ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. సమ్మక్క సారక్క మహిళా జిల్లా సమాఖ్యలో 87, 134 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారని తెలిపారు. బ్యాంకు లింకేజి ద్వారా ఇప్పటి వరకు రూ.240 కోట్లకు పైగా రుణాలు,1,1 7,220 ఇందిరమ్మ చీరలు పంపిణీ చేసినట్లు చెప్పారు. భూపాలపల్లి ము న్సి పాల్టీలో రూ.113 కోట్లతో అభివృద్ధి పనులు చేప ట్టామని, పట్టణ మహిళా సంఘాలకు బ్యాంకు లింకే జి, వ్యక్తిగత రుణాలు అందిస్తున్నట్లుతెలిపారు. మారుమూల గ్రామాలు, నిరుపేదల సమగ్రాభివృద్ధికి నిరం తరం కృషి చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి, పార్లమెంట్, శాసన మండలి, శాసన సభ్యులకు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు, జిల్లా ప్రజలకు, ప్రభుత్వ యం త్రాంగానికి, మీడియా మి త్రులకు జిల్లా కలెక్టర్ హృ దయపూర్వక ధన్యవాదా లు తెలిపారు. అనంతరం పాఠశాల విద్యార్థులు ప్రద ర్శించిన నృత్య ప్రదర్శనలు ఆహుతులను ఆకట్టుకు న్నాయి. తదుపరి ఉత్తమ సేవలు అందించిన ఉద్యో గులకు ప్రశంషా పత్రాలు అందచేశారు. అనంతరం వివిధ శాఖల అధికారులు ఏర్పాటు చేసిన స్టాళ్లు పరిశీలించారు. ఈ కార్యక్ర మంలోఎస్పి సిరిశెట్టి సంకీ ర్త్, శాసన సభ్యులు గండ్ర సత్యనారాయణ రావు, అదనపు కలెక్టర్లు పడాల అశోక్ కుమార్, విజయ లక్ష్మి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, గ్రంధాల య సంస్థ చైర్మన్ రాజబా బు, ఆర్డిఓ బాలకృష్ణ, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: