Friday, 31 July 2026 07:18:57 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలి

కలెక్టర్ కుమార్ దీపక్

Date : 24 October 2025 07:33 PM Views : 324

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : మంచిర్యాల జిల్లా చెన్నురు నియోజకవర్గం మున్సిపాలిటీల పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. శుక్రవారం జిల్లాలోని క్యాతనపల్లి మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించి రిజిస్టర్లు, మున్సిపల్ పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతి వివరాలు, పారిశుధ్య నిర్వహణ అంశాలను మున్సిపల్ కమిషనర్ రాజు తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపాలిటీల పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు. అంతర్గత రహదారులు, మురుగు కాలువల నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని, పారిశుధ్య నిర్వహణలో భాగంగా వార్డులలోని ప్రతి ఇంటి నుండి ప్రతి రోజు తడి చెత్త, పొడి చెత్తలను వేరువేరుగా సేకరించి డంపింగ్ యార్డ్ కు తరలించాలని తెలిపారు. ప్రతి ఇంటికి ఎలాంటి అంతరాయం లేకుండా త్రాగునీరు సరఫరా చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. నర్సరీలలో నాటేందుకు అవసరమైన మొక్కలను అభివృద్ధి చేయాలని, మొక్కల సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి అందించే విధంగా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు. మున్సిపల్ పరిధిలో పెండింగ్ ఉన్న పనులపై ప్రత్యేక దృష్టి సారించి త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. మున్సిపల్ పరిధిలో రెండు పడకగదుల ఇండ్ల పథకంలో భాగంగా నిర్మించిన భవనాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.అమృత్ 2.0 పథకంలో భాగంగా మున్సిపల్ పరిధిలో కొనసాగుతున్న నీటి బ్యాంకుల నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ పథకం ద్వారా ప్రతి ఇంటికి త్రాగునీటిని సరఫరా చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసే విధంగా అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు. అనంతరం మందమర్రి మండల కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించి మున్సిపల్ కమిషనర్ రాజలింగుతో కలిసి అభివృద్ధి పనుల పురోగతి, పారిశుధ్యం, నర్సరీల నిర్వహణ, తాగునీటి సరఫరా, రెండు పడక గదుల ఇండ్ల పథకం నిర్వహణపై సమీక్షించారు. మున్సిపల్ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేసే విధంగా సంబంధిత అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: