Thursday, 30 July 2026 08:17:13 AM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలి...

కలెక్టర్ కుమార్ దీపక్

Date : 17 May 2026 11:44 PM Views : 95

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా నిబంధనల ప్రకారం రైతుల వద్ద నుండి నాణ్యమైన ధాన్యం కొనుగోలు చేయాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. ఆదివారం మంచిర్యాల జిల్లా జిల్లాలోని హాజీపూర్ మండలం గుడిపేట, నమ్నూర్, దొనబండ, లక్షెట్టిపేట మండలం గుల్లకోట లలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధర చెల్లించి రైతుల వద్ద నుండి నిబంధనల ప్రకారం నాణ్యమైన ధాన్యం కొనుగోలు చేస్తుందని తెలిపారు. కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఇబ్బందులు లేకుండా త్రాగునీరు, నీడ సౌకర్యాలు కల్పించడంతో పాటు గోనె సంచులు, టార్పాలిన్ కవర్లు, తేమ యంత్రాలు, ప్యాడి క్లీనర్లు ఇతర సదుపాయాలు అందుబాటులో ఉంచాలని నిర్వాహకులకు సూచించారు. వరి ధాన్యం కొనుగోలు విషయంలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకూడదని, కొనుగోలు కేంద్రాల నుండి కొనుగోలు చేసిన ధాన్యాన్ని కేటాయించిన ప్రకారంగా రైస్ మిల్లులకు, గోదాములకు తరలించాలని, లక్షెట్టిపేట మండలం మిట్టపల్లి, లక్ష్మీపూర్ లలో గల రైస్ మిల్లులను మండల తహసిల్దార్ దిలీప్ కుమార్ తో కలిసి సందర్శించి ధాన్యం దిగుమతి ప్రక్రియ పరిశీలించారు. రైస్ మిల్లర్లు కొనుగోలు కేంద్రాల నుండి వచ్చిన ధాన్యాన్ని త్వరగా దిగుమతి చేసుకోవాలని తెలిపారు. ఒకరోజులో కనీసం 10 నుంచి 15 లారీల ధాన్యాన్ని దిగుమతి చేసుకోవాలని, అవసరం మేరకు హమాలీల సంఖ్య పెంపొందించుకోవాలని సూచించారు. వరి ధాన్యం కొనుగోలు, దిగుమతి ప్రక్రియ అనుసంధానంగా జరగాలని, రవాణా శాఖ ఆధ్వర్యంలో ధాన్యం తరలింపుకు అవసరమైన లారీలను సమకూర్చడం జరుగుతుందని, రైస్ మిల్లుల యజమానులు ధాన్యం దిగుమతి ప్రక్రియ వేగవంతంగా చేపట్టాలని తెలిపారు. అనంతరం మండల కేంద్రంలో గల 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి వార్డులు, ల్యాబ్, మందుల నిల్వలు, రిజిస్టర్లు, పరిసరాలను పరిశీలించారు. ఆసుపత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. వేసవి అయినందున వడదెబ్బకు గురికాకుండా పాటించవలసిన జాగ్రత్తలను ప్రజలకు వివరించాలని, వైద్యులు, సిబ్బంది విధుల పట్ల సమయపాలన పాటించాలని తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రజలతో మాట్లాడి ఆసుపత్రిలో కల్పించిన సౌకర్యాలు, అందిస్తున్న వైద్యసేవల వివరాలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :