Friday, 31 July 2026 04:38:14 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

చట్టవ్యతిరేక చర్యలపై మహిళలు, ప్రజలు పోలీసులపైభరోసాతో ఉండాలి...

పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా...

Date : 24 February 2026 07:16 PM Views : 172

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : చట్టవ్యక్తి వ్యతిరేక చర్యలపై ప్రజలు పోలీసులపై భరోసాతో ఉండాలని రామగుండం సిపి తెలిపారు. మంగళవారం జనవరి నెలవారీ నేరసమీక్ష సమావేశం భాగంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో పోలీస్ కమిషనర్అంబర్ కిషోర్ ఝా,పెద్దపల్లి,మంచిర్యాల జోన్‌ల పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశంనిర్వహించారు. ఈ సమావేశంలో పెద్దపల్లి డీసీపీ, అడిషనల్ డీసీపీ (అడ్మిన్),ఏసీపీలు, సీఐలు,ఎస్సైలు పాల్గొన్నారు. పోలీస్ స్టేషన్,డివిజన్,జోన్ వారీగా పెండింగ్ కేసుల స్థితిగతులు, నేరస్థుల అరెస్టులు, దర్యాప్తు పురోగతి, సాక్ష్యాధారాల సేకరణ, చార్జ్ షీట్ల దాఖలుపై కమిషనర్స్ వీక్షించారు.ముఖ్యంగా గ్రేవ్ కేసులు,మహిళలపై నేరాలు,ఆస్తి నేరాలు, పోక్సో,మిస్సింగ్, గంజాయి,రోడ్డు ప్రమాదాల కేసులపై ప్రత్యేక దృష్టి సారించి, గతంలో జరిగిన లోపాలు మరియు భవిష్యత్తులో కేసుల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ, దర్యాప్తు నాణ్యతను మెరుగుపరచడంతో పాటు కేసుల పరిష్కార శాతాన్ని పెంచాలని సూచించారు.పాత మరియు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ( యు ఐ & పిటి ) కేసులను ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికతో త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.ప్రతి కేసును పారదర్శకంగా, వేగంగా పూర్తి చేసి బాధితులకు న్యాయం అందించాలని సూచించారు. ముఖ్యంగా మహిళలపై నేరాలకు సంబంధించిన కేసుల్లో సాక్ష్యాధారాలను బలంగా కోర్టులో సమర్పించి, నిందితులకు శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎస్సీ ఎస్టీ ప్రతి కేసులోఉన్నతాధికారుల పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలన్నారు. దర్యాప్తు నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. సంఘటన స్థలాన్ని సందర్శించి, ఫిర్యాదులో ఉన్న అంశాలపై సమగ్ర విచారణ చేసి, సాక్ష్యాధారాలు సేకరించి ప్రతి అంశాన్ని వీడియో రికార్డింగ్ చేయాలి. ఎస్సీ ఎస్టీ మరియు పోక్సో కేసుల్లో బాధితులకు పరిహారం త్వరగా అందేలా చూడాలన్నారు. మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించి, వేగంగా స్పందించాలన్నారు. బాడిలీ నేరాలు, హత్య, హత్యాయత్నం, ఇతర గ్రేవ్ కేసుల్లో రౌడీ షీటర్ల ప్రమేయం ఉన్న కేసుల్లో నిందితుల అరెస్టులు,చార్జ్ షీట్లు పెండింగ్‌లో ఉండకూడ దన్నారు. ప్రతి శనివారం కమిషనరేట్, పోలీస్ స్టేషన్ పరిధిలో కోర్ట్ కానిస్టేబుల్‌తో కోర్టు సంబంధిత అంశాలపై సమావేశం నిర్వహించి కన్విక్షన్ రేటును పెంచేందుకు కృషి చేయాలి. నిందితులకు శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలన్నారు. సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విస్తృత ప్రచారం నిర్వహించి, బాధితులకు సకాలంలో సహాయం చేయాలన్నారు. గంజాయి, డ్రగ్స్ వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలపై కమిషనరేట్‌లో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గంజాయి అక్రమ రవాణా, రౌడీషీటర్ల చట్టవ్యతిరేక చర్యలను కట్టడి చేస్తే నేరాల నియంత్రణ సాధ్యమవుతుందన్నారు. మహిళలు, ప్రజలు ఎలాంటి భయం లేకుండా రాత్రిపూట కూడా పోలీసులపై నమ్మకం, భరోసాతో ధైర్యంగా బయట తిరగగలరు. మీ మీ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేక శ్రద్ధతో పెట్రోలింగ్ నిర్వహించాలి. బ్లూ కోట్స్,పెట్రో కార్ సిబ్బంది, పాయింట్ బుక్స్‌ను తనిఖీ చేస్తూ ఉండాలి. చట్టాన్ని ఉల్లంఘించిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని హెచ్చరించారు. “అరైవ్–అలైవ్” రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. రోడ్డు ప్రమాదాల వలన ప్రాణ నష్టం జరగకుండా ప్రజలకు, వాహనదారులకు అవగాహన కల్పిస్తూ చైతన్యం తీసుకు రావాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు రోడ్డు సేఫ్టీ విభాగంతో సమన్వయంగా పనిచేసి, ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి కారణాలపై విశ్లేషణ చేయాలి. గ్రామీణ రోడ్డు సేఫ్టీ కమిటీలతో సమావేశాలు నిర్వహించి, రోడ్డు సేఫ్టీ వాలంటీర్లను ఏర్పాటు చేయాలని తెలిపారు. రాబోయే 10వ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 144 అమల్లో ఉంటుందని పోలీస్ స్టేషన్ నుండి ప్రశ్నపత్రాలను పరీక్ష కేంద్రాలకు తీసుకెళ్లడం,పరీక్ష అనంతరం జవాబు పత్రాలను తిరిగి పోలీస్ స్టేషన్‌కు తీసుకురావడం వరకు భద్రత కల్పించాలన్నారు . పరీక్ష కేంద్రాల వద్ద బందోబస్తులో ఉన్న పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ డీసీపీ (అడ్మిన్) కె.శ్రీనివాస్, గోదావరిఖని ఏసీపీ ఎం.రమేష్, మంచిర్యాల ఏసీపీ ఆర్.ప్రకాష్, పెద్దపల్లి ఏసీపీ జి.కృష్ణ, బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, సైబర్ క్రైమ్ ఏసీపీ వెంకటరంగారెడ్డి, కమిషనరేట్ పరిధిలోని సీఐలు, ఇన్‌స్పెక్టర్లు, వివిధ విభాగాల అధికారులు, ఎస్సైలు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: