ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : మంథని మండలం కన్నాల గ్రామ సర్పంచ్ గుడిసె గట్టయ్య యాదవ్ ఆర్జి-3 జిఎం సుంకర మధుసూదన్ ను శనివారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించాడు. అనంతరం కన్నాల గ్రామంలోని సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. గ్రామంలో సమస్యలను జిఎం దృష్టికి తీసుకువెళ్లడంతో సానుకూలంగా స్పందించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చినట్లు గట్టయ్య యాదవ్ పేర్కొన్నారు. ఆయన వెంట మాజీ సర్పంచ్ మంగ దామోదర్ రెడ్డి తదితరులు ఉన్నారు.
Admin
E Nivas News