Saturday, 25 April 2026 10:53:39 PM
# తెలంగాణ రాష్ట్ర సేన ద్వారా ప్రజలకు న్యాయం చేస్తాం.. # ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు మద్దతు ధర లభిస్తుంది # ఎదురుపాడు చెంచు కాలనీలకు మౌలిక వసతులు కల్పించండి # అర్హులైన పాత్రికేయులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం అక్రిడిటేషన్ కార్డులు మంజూరు # కెసిఆర్ లేకపోతే కవిత ప్రస్తా వన ఉండేదా? # సిద్దేశ్వరం చెంచులను ఐటీడీఏలో చేర్పించండి # స‌జ్జ‌నార్‌కు పదోన్నతి.. # హైకోర్టు తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు..! రేవంత్ రెడ్డి కుట్రలకు చెక్ పెట్టిన న్యాయస్థానం.. # యేసు పునరుత్థాన జాతరకు వేళాయె.. # మున్నూరు కాపు సంఘం రాష్ట్ర కార్యదర్శిగా సత్యనారాయణ పటేల్ # ఆర్టీసీ కార్మికుల మరణాలకు రేవంత్ రెడ్డి సర్కారే పూర్తి బాధ్యత వహించాలి.. # ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబానికి 10 లక్షల ఆర్థిక సహాయం అందిస్తాం.. # ఆర్టీసీ డ్రైవర్ మృతి పట్ల సీఎం సంతాపం.. # ప్రజలకు తెలిసేలా వాస్తవాలను ప్రచురించాలి... # వడదెబ్బతో ఫోటోగ్రాఫర్ మృతి # ప్రజా పాలన ప్రభుత్వాన్ని విమర్శించడం సిగ్గుచేటు # కష్టపడి చదివి ఉన్నత స్థా నాలకు వెళ్లాలి # నంద్యాల పట్టణంలో మే,-9న జరిగే దళిత క్రైస్తవుల గర్జన' పోస్టర్ విడుదల చేసిన నంద్యాల ఎంపీ-డాక్టర్ బైరెడ్డి శబరి # ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా ఐక్య పోరాటాలు:- సిపిఐ(ఎంఎల్) లిబరేషన్ # ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ ని మర్యాదపూర్వకంగా కలిసి, శుభాకాంక్షలు తెలిపిన సింగిల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దీన్

జూన్ 2 నుంచి రైళ్లలో పురుషులకు ఉచిత ప్రయాణానికి ఏర్పాట్లు...

Date : 19 April 2026 11:18 PM Views : 151

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : హైదరాబాద్ మహానగరం లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. జూన్ 2 నుంచి ఎంఎంటిఎస్,రైళ్లలో ఉచిత ప్రయాణం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నగరవ్యా ప్తంగా నడిచే ఎంఎంటీఎస్ రైళ్లలో మహిళలు, పురు షులు అనే తేడా లేకుండా అందరికీ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనుంది. జూన్ 2వ తేదీ నుంచి ఈ చారిత్రాత్మక పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది. భాగ్య నగరంలో రోజురోజుకూ పెరిగిపోతున్న కాలుష్యాన్ని నియంత్రించడంతో పాటు, సామాన్యుడిపై రవాణా భారాన్నితగ్గించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఎంఎంటీఎస్ రైళ్లలో ఉచిత ప్రయాణ పథకానికి ఆయన ఆమోదం తెలిపారు. తెలంగాణ ఆవిర్భావది నోత్సవ కానుకగా జూన్ 2 నుంచి ఏడాది పాటు ప్రయోగాత్మకంగా ఈ పథకాన్ని అమలు చేయ నున్నారు. దీనిపై ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, దక్షిణ మధ్య రైల్వే ఉన్నతా ధికారులతో చర్చలు జరిపారు. ప్రస్తుతం ఎంఎంటీఎస్ ద్వారా రైల్వే శాఖకు ఏడాదికి సుమారు రూ. 10 కోట్ల ఆదాయం వస్తోంది. ఉచిత పథకం వల్ల ప్రయాణికుల సంఖ్య ఎంత పెరిగినా, రైల్వేకు వచ్చే ప్రస్తుత ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేసింది.ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్‌కు ప్రభుత్వం అధికారికంగా లేఖ రాసింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :