ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు జీవో ఎంఎస్ నెంబర్ 149 ద్వారా ఎస్టీలుగా కొనసాగుతున్న లంబాడ బంజారా సుగాలీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని, ఇతర రాష్ట్రాలలో ఓసీలుగా బీసీలుగా ఎస్సీలుగా ఓబీసీ కులాలుగా కొనసాగుతూ తెలంగాణ రాష్ట్రానికి వలస వచ్చిన వలస వస్తున్న లంబాడి బంజారా సుగాలీలను మన రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి వారి ఎస్టి హోదాను రద్దు చేయాలని గురువారంఆదివాసి సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆదివాసి సంఘం నాయకులు మాట్లాడుతూ జీవో ఎంఎస్ నెంబర్ 3 పై సుప్రీంకోర్టు తీర్పును సమీక్ష చేసి ఈ జీవోతోపాటు ఆదివాసి0 నిరుద్యోగులకు రాష్ట్రంలోని షెడ్యూల్డ్ ఏరియా ఉద్యోగ కల్పన 29 జీవోలను కలిపి చట్ట పరిధిలోనికి తీసుక రావాలన్నారు. 2018 తెలంగాణ రాష్ట్ర జోనల్ ఉత్తర్వుల అమలు కోసం జారీచేసిన జీవో ఎంఎస్ నంబర్ 317 ను రాష్ట్రంలోని షెడ్యూల్డ్ ఏరియాలో ఈ జీవో యొక్క చర్యలు, ప్రక్రియలను రద్దు చేయాలి -- 2018 జోనల్ ఉత్తర్వుల నుండి రాష్ట్రంలోని షెడ్యూల్డ్ ఏరియాలను మినహాయించాలన్నారు. 1/70 చట్టాన్ని పి ఈ ఎస్ ఏ ను, 1960 షెడ్యూల్డ్ ఏరియాలో గిరిజనేతర వడ్డీ వ్యాపార నిషేధ చట్టాలను, 2007 అటవీ హక్కుల చట్టాన్ని స్వర్గీయ డాక్టర్ కోనేరు రంగారావు చట్టబద్ద సిఫారసులను అమలు చేయాలి -- స్వర్గీయ గ్లీర్గాని రిటైర్డ్ ఐఏఎస్ రిపోర్టును బహిర్గతం చేసి అమలు చేయాలి -- గిరిజనేతరుల చేతుల్లో ఏళ్ల తరబడి ఉన్న 1/70 చట్ట భూములను ఆదివాసులకు ఇప్పించాలన్నారు. పి ఈ ఎస్ ఏ చట్టం ప్రకారం షెడ్యూల్డ్ ఏరియా పాలన ఆదివాసులతో కొనసాగా లని,1960 చట్టం ప్రకారం గిరిజనేతరుల వడ్డీ వ్యాపారాలు, ఇతర వ్యాపారాలను అరికట్టాలన్నారు. ఆదివాసులను దోపిడీ చేస్తున్న గిరిజనేతర వ్యాపారులపై కఠిన చర్యలు చట్టపరంగా తీసుకోవాలన్నారు .2007 అటవీ హక్కుల చట్టం ప్రకారం ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్నా అటవీ భూములకు పట్టాలు ఇవ్వాలి మరియు ఆదివాసుల అసైన్డ్ భూములకు శాశ్వత పట్టాలివ్వా లన్నారు. షెడ్యూల్డ్ ఏరియాలోని ఇనాం ,జంగు, సిపాయి, దేవాదాయ ధర్మాదాయ కరణం భూములను ఆ గిరిజనేతరుల చేతుల్లోని వలసల ద్వారా ఆక్రమించిన భూములను ఇతర భూములను ఆదివాసులకు పంపిణీ చేయాలన్నారు. పైన తెలిపిన డిమాండ్లతో పాటు తదితర డిమాండ్లతో ఈ సభను నిర్వహించడం జరుగుతుంది కావునా డిసెంబర్ 9న జిల్లా కేంద్రంలో ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. సామాజిక ఉద్యమాభివందఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు విజయ్ కుమార్, ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుందేబ్బ జాతీయ నాయకులు బూర్శ పోచయ్య నాయకులు పాల్గొన్నారు.
Admin
E Nivas News