ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఆత్మకూరు పట్టణ ప్రాంతంలో ఒక నక్షత్ర తాబేలు కనిపించడంతో, సమీర్ అనే వ్యక్తి వెంటనే ఇస్మాయిల్ (సంఘమిత్ర అనిమల్స్ ఫౌండేషన్) వారికి సమాచారం అందించారు. డిప్యూటీ డైరెక్టర్ పిటి ఎన్ఎస్ టిఆర్ విగ్నేష్ (ఐఎఫ్ఎస్) ఆదేశాల మేరకు ఆ నక్షత్ర తాబేలును వైల్డ్ లైఫ్ వెటర్నరీ డాక్టర్ వెస్లీ కి సురక్షితంగా అప్పగించారు. ఈ సందర్భంగా డిప్యూటీ డైరెక్టర్ ఎన్ఎస్ టిఆర్ ఐఎఫ్ఎస్-విగ్నేష్ మాట్లాడుతూ తాబేళ్లు (టోర్టోయిస్) మరియు తాబేళ్ల జాతికి చెందిన టర్టిల్స్ ను పెంపుడు జంతువులుగా ఉంచుకోవడం చట్టవిరుద్ధం మరియు అనైతికమని తెలిపారు. ఎవరైనా ఇటువంటి వన్యప్రాణులు కనిపించినట్లయితే వెంటనే అటవీ శాఖ కు సమాచారం అందించాలని తెలిపారు. ఈ సందర్భంగా తాబేలును సురక్షితంగా అప్పగించిన సమీర్ ను ఫారెస్ట్ అధికారులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ శాఖ సిబ్బంది, వైల్డ్ లైఫ్ సిబ్బంది పాల్గొనడం జరిగింది.
Admin
E Nivas News