Friday, 17 April 2026 05:09:57 PM
# మహిళలు పారిశ్రామి కవేత్త లుగాఎదగాలి # రానున్న మూడు రోజుల్లో మరింత ఎండలు పెరిగే అవకాశం.. # ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక మండల సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ... # రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన వేం నరేందర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి డా. వివేక్ వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీకృష్ణ # తెలంగాణలో అతి త్వరలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ # మేటిగుడా గ్రామంలో షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ధైర్యంగా ఉండండి అండగా ఉంటా.. # యువత ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి... # ఎండల్లో బయటకు రావొద్దు..! ప్రజలకు మంత్రి సీతక్క సూచన # అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి # విజయవంతంగా ముగిసిన చిన్న కాళేశ్వరం ఇరిగేషన్ భూసేకరణ # మంథని నియోజకవర్గ ప్రజలను అవమాన పరు స్తున్న పుట్టమధు వైఖరి మార్చుకోవాలి # సరస్వతి పుష్కర ఘాట్ వద్ద జరుగుతున్న స్టోన్ క్లాడింగ్ పనులను ఈ నెలా ఖరు లోగా పూర్తి చేయాలి # మద్దులపల్లిలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # మహనీయుల స్ఫూర్తితో దీక్ష నేటితో విరవింపజేశాం # పదవులకు వన్నె తెచ్చేలా నాయకుల పనితనం ఉండాలి # స్వేచ్ఛ సమానత్వానికి ప్రదీప్తి – 'డా. బి.ఆర్. అంబేద్కర్ # మృతుడి కుటుంబానికి ప్రమాద భీమా చెక్కు పంపిణీ # ప్రజాసేవనే తన ప్రాణం ఆయన జీవితమే అందరికి మార్గం.. # దోస్త్ నోటిఫికేషన్ విడుదల..

ఏప్రిల్ 1 నుంచి కొత్త ట్రాఫిక్ రూల్స్ ప్రారంభం..

Date : 22 March 2026 11:01 PM Views : 122

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : వాహన యాజమానుల్లారా మీ వాహనంపై ట్రాఫిక్ చలాన్లు పెండింగ్ లో ఉన్నాయాతర్వాత కట్టుకోవచ్చులే అని లైట్ తీసుకుంటున్నారా ప్రభుత్వం ఎప్పుడైనా డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటించినప్పుడు చూద్దాంలేఅనుకుంటున్నారాఅయితే మీరు భారీ చిక్కుల్లో పడబోతున్నారు. ఏప్రిల్ 1 నుండి ట్రాఫిక్ నిబంధనలు అస్స లు ఊహించని విధంగా కఠినం కాబోతున్నాయి. ఇకపై చలాన్లు కట్టకుండా తప్పించుకోవడం కుదరదు సరికదా మీ డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్ కూడా రద్దయ్యే ప్రమాదం ఉంది. తెలంగాణ వ్యాప్తం గా ఈ కొత్త రూల్స్‌ను పక్కాగా అమలు చేసేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న నయా రూల్స్ కేంద్ర మోటార్ వెహికల్ నిబంధనలకు అనుగుణం గా తెలంగాణ ప్రభుత్వం ట్రాఫిక్ నిబంధనలను భారీగా సవరించింది. కొత్త రూల్స్ ప్రకారం ఒక వాహనంపై ఏడాదికి 5 కంటే ఎక్కువ చలాన్లు ఉండి, వాటిని నిర్ణీత సమయంలోపు చెల్లించక పోతేఆ వాహన యజ మాని డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కూడా ఫ్రీజ్ చేయబడుతుంది. అంటే, చట్టపరంగా ఆ వాహనం రోడ్డుపై తిరగడానికి అనర్హ మైనదిగా పరిగణించబడు తుంది. ఒకవేళ లైసెన్స్ ఫ్రీజ్ అయిన తర్వాత కూడా వాహనాన్ని రోడ్డుపైకి తీస్తే, పోలీసులు దానిని వెంటనే సీజ్ చేస్తారు. ఇకపై చలాన్ పడిన తర్వాత దానిని చెల్లించడానికి గరిష్టంగా 45 రోజుల సమయం మాత్రమే ఉంటుంది. ఈ గడువు ముగిసినా ఫైన్ పే చేయని పక్షంలో, ఆ వాహనంపై అధికారులు చర్యలు ప్రారంభిస్తారు. వాహనాన్ని రోడ్డు మీద నడపకపోయినా, ఇంట్లో పెట్టుకున్నా సరే.. డేటాబేస్‌లో అది బ్లాక్ లిస్ట్‎లోకి వెళ్ళిపోతుంది. దీనివల్ల భవిష్యత్తులో వాహనాన్ని అమ్మాలన్నా లేదా ఇన్సూరెన్స్ రీన్యూవల్ చేయాలన్నా సాధ్యపడదు. ప్రభుత్వం గతంలో ఇచ్చినట్లుగా చలాన్లపై భారీ డిస్కౌంట్లు ఇచ్చే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు. తప్పుడు చలాన్లు పడితే ఏం చేయాలి కొన్నిసార్లు టెక్నికల్ సమస్యల వల్ల లేదా కెమెరా తప్పుగా రీడ్ చేయడం వల్ల ఒకరి చలాన్ మరొకరికి పడుతుంటుంది. ఇలాంటి తప్పులను సరిదిద్దడానికి ప్రభుత్వం గ్రీవెన్స్ రెడ్రెసల్ అథారిటీని ఏర్పాటు చేయబోతోంది. చలాన్ పడిన వెంటనే మీ అభ్యంతరాలను ఇక్కడ వ్యక్తం చేయవచ్చు. ఒకవేళ అది నిజంగానే పొరపాటు అని తేలితే, నిర్ణీత సమయంలోపు ఆ చలాన్‌ను రద్దు చేస్తారు. దీని కోసం ప్రభుత్వం త్వరలోనే ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేయనుంది. నెలకు ఒకసారి ఆన్‌లైన్ చెక్ చేసుకోండి.. వాహనదారులు ఇకపై చాలా జాగ్రత్తగా ఉండాలి. ట్రాఫిక్ పోలీసులు నేరుగా ఆపకపోయినా, సీసీ కెమెరాల ద్వారా చలాన్లు ఆటోమేటిక్‌గా జనరేట్ అవుతున్నాయి. కాబట్టి, మీకు మెసేజ్ రాకపోయినా సరే కనీసం నెలకోసారి ఆన్‌లైన్‌లో మీ వెహికల్ నంబర్‌తో చలాన్లు ఏమైనా ఉన్నాయేమో చెక్ చేసుకోవడం మంచిది. హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ పెట్టుకోవడం, సిగ్నల్ జంప్ చేయకపోవడం వంటి ప్రాథమిక నియమాలు పాటిస్తే.. ఈ కఠిన నిబంధనల నుంచి తప్పించుకోవచ్చు. లేదంటే మాత్రం మీ వాహనం పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడం ఖాయం.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :