Friday, 17 April 2026 03:49:08 PM
# మహిళలు పారిశ్రామి కవేత్త లుగాఎదగాలి # రానున్న మూడు రోజుల్లో మరింత ఎండలు పెరిగే అవకాశం.. # ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక మండల సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ... # రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన వేం నరేందర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి డా. వివేక్ వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీకృష్ణ # తెలంగాణలో అతి త్వరలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ # మేటిగుడా గ్రామంలో షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ధైర్యంగా ఉండండి అండగా ఉంటా.. # యువత ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి... # ఎండల్లో బయటకు రావొద్దు..! ప్రజలకు మంత్రి సీతక్క సూచన # అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి # విజయవంతంగా ముగిసిన చిన్న కాళేశ్వరం ఇరిగేషన్ భూసేకరణ # మంథని నియోజకవర్గ ప్రజలను అవమాన పరు స్తున్న పుట్టమధు వైఖరి మార్చుకోవాలి # సరస్వతి పుష్కర ఘాట్ వద్ద జరుగుతున్న స్టోన్ క్లాడింగ్ పనులను ఈ నెలా ఖరు లోగా పూర్తి చేయాలి # మద్దులపల్లిలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # మహనీయుల స్ఫూర్తితో దీక్ష నేటితో విరవింపజేశాం # పదవులకు వన్నె తెచ్చేలా నాయకుల పనితనం ఉండాలి # స్వేచ్ఛ సమానత్వానికి ప్రదీప్తి – 'డా. బి.ఆర్. అంబేద్కర్ # మృతుడి కుటుంబానికి ప్రమాద భీమా చెక్కు పంపిణీ # ప్రజాసేవనే తన ప్రాణం ఆయన జీవితమే అందరికి మార్గం.. # దోస్త్ నోటిఫికేషన్ విడుదల..

ఉపాధ్యాయుడు....టీచరేనా? లేక మల్టీ పర్పస్ ప్రభుత్వ కూలీనా

Date : 27 January 2026 12:06 PM Views : 854

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : భారతీయ విద్య వ్యవస్థలో సమాజ భవిష్యత్తును మలిచే శక్తి ఉపాధ్యాయుడి చేతుల్లో ఉందని ప్రతి ప్రభుత్వం, ప్రతి నాయకుడు గొప్పగా చెబుతూనే ఉంటారు. కానీ వాస్తవానికి వస్తే ఆ ఉపాధ్యాయుడిని ఒక టీచర్ గా కాకుండా, ఒక మల్టీ పర్పస్ ప్రభుత్వ కూలీగా మార్చిన దుస్థితి నేటి భారతీయ విద్యా వ్యవస్థలో స్పష్టంగా కనిపిస్తోంది. ఉపాధ్యాయుడి ప్రధాన బాధ్యత బోధన. విద్యార్థికి జ్ఞానం అందించడం, విలువలు నేర్పించడం, ఆలోచన శక్తిని పెంపొందించడం అతని ధర్మం. కానీ నేడు ఆ ధర్మానికి ఎంత సమయం దొరుకుతోంది? ఓటరు జాబితాల తయారీ, జనగణన, సర్వేలు, ఎన్నికల విధులు, పింఛన్ పంపిణీ, రేషన్ కార్డుల పరిశీలన, ఆరోగ్య శిబిరాలు, ప్రభుత్వ పథకాల ప్రచారం ఇవి అన్నీ ఉపాధ్యాయుడి భుజాల మీదే మోపబడుతున్నాయి. "ప్రభుత్వ ఉద్యోగి కదా! చేయాల్సిందే"అన్న నిర్లక్ష్య ధోరణి ఉపాధ్యాయుడి ఆత్మగౌరవాన్ని క్రమంగా తుంచేస్తోంది. తరగతి గదిలో పాఠం చెప్పాల్సిన ఉపాధ్యాయుడు, ఎండలో నిలబడి ఓటరు వివరాలు నమోదు చేస్తున్న దృశ్యం సాధారణమైపోయింది. పాఠ్య ప్రణాళికలు, విద్యార్థుల మూల్యాంకనం, వ్యక్తిగత మార్గనిర్దేశం ఇవన్నీ పక్కకు నెట్టబడి, "ఇవాళ ఏ డ్యూటీ?”"అనే ప్రశ్నే ముందుకు వస్తోంది. దీని ప్రభావం విద్యార్థులపై తీవ్రంగా పడుతోంది. ఉపాధ్యాయుడు పూర్తిగా తరగతిలో లేనప్పుడు, విద్యా ప్రమాణాలు ఎలా మెరుగుపడతాయి? పాఠాలు అర్ధాంతరంగా ముగుస్తున్నాయి. సిలబస్ తొందరపడి పూర్తి చేయాల్సి వస్తోంది. విద్యార్థి, ఉపాధ్యాయుల మధ్య ఉన్న మానవ సంబంధం బలహీనమవుతోంది. చివరికి బాధ్యత మొత్తం ఉపాధ్యాయుడిపైనే పడుతుంది. "చదువు పడిపోతోంది" అని విమర్శలు కూడా అతనికే.ఇక్కడ ప్రశ్న ఒకటే ఉపాధ్యాయుడిని అన్ని పనులకు వాడుకుంటే, అతను ఉపాధ్యాయుడిగా ఎప్పుడు పనిచేస్తాడు? ప్రభుత్వానికి అవసరమైన పనులు అవసరమే. కానీ ప్రతి పనికీ ఉపాధ్యాయుడే పరిష్కారమా? ప్రత్యేక విభాగాలు, ప్రత్యేక సిబ్బంది ఉండాల్సిన చోట, విద్యా వ్యవస్థను తాకట్టు పెట్టడం ఎంతవరకు సమంజసం? ఉపాధ్యాయుడిని "అందుబాటులో ఉన్న ఉద్యోగి"గా కాకుండా, "భవిష్యత్ నిర్మాత"గా చూడాల్సిన అవసరం ఉంది. ఉపాధ్యాయుడికి గౌరవం మాటల్లో కాదు, విధానాల్లో కనిపించాలి. బోధనకు పూర్తి సమయం, మానసిక ప్రశాంతత, వృత్తిపరమైన స్వేచ్ఛ లభించినప్పుడే నిజమైన విద్య వికసిస్తుంది. లేకపోతే పాఠశాలలు భవిష్యత్తు పునాదులు కాకుండా, ప్రభుత్వ ఆదేశాల అమలు కేంద్రాలుగా మారిపోతాయి.అంతిమంగా చెప్పాలంటే ఉపాధ్యాయుడు టీచరే. అతన్ని మల్టీ పర్పస్ ప్రభుత్వ కూలీగా మార్చిన రోజు సమాజమే తన భవిష్యత్తును తానే దెబ్బతీసుకున్నట్టే. విద్య వ్యవస్థలో ఉపాధ్యాయులపై పెరుగుతున్న అపమ్మకాలు, ఫేషియల్ అటెండెన్స్, ఎలక్షన్ డ్యూటీలు,'టీచర్ దొంగనా?' అనే అపవాదాలు

*ఫేషియల్ అటెండెన్స్... క్రమశిక్షణా? లేక అవమానమా?* ఫేషియల్ అటెండెన్స్ వ్యవస్థను ప్రభుత్వాలు పనిచేసే గంటల పర్యవేక్షణ పేరిట ప్రవేశపెట్టాయి.కానీ వాస్తవంలో ఇది ఉపాధ్యాయులపై అనమ్మకానికి ప్రతీకగా మారింది.ఉపాధ్యాయుడిని ప్రొఫెషనల్గా కాకుండా సందేహిత ఉద్యోగిగా చూడడం సాంకేతిక లోపాల వల్ల (నెట్‌వర్క్, ఫోన్ సమస్యలు) అనవసరమైన శిక్షలు బోధన కన్నా "హాజరు నమోదు" పై ఒత్తిడి మానసిక ఒత్తిడి, ఆత్మగౌరవ హాని, ఒక డాక్టర్, జడ్జ్, ఐఏఎస్‌కు లేని విధానం ఉపాధ్యాయుడికే ఎందుకు? అనే ప్రశ్న ఇక్కడ సహజంగా ఉత్పన్నమవుతుంది. *ఎలక్షన్ డ్యూటీలు.. ప్రజాస్వామ్య సేవా? లేక విద్యా విధ్వంసమా?* ఎన్నికలు ప్రజాస్వామ్యానికి అవసరం.కానీ ఉపాధ్యాయులను నెలల తరబడి విద్యాబోధన నుంచి దూరం చేయడం విద్యార్థుల భవిష్యత్తుకు నష్టం. శిక్షణ రిహార్సల్స్,పోలింగ్,కౌంటింగ్,మొత్తం బోధన కాలం కోల్పోవడం, గ్రామీణ ప్రాంతాల్లో విద్య పూర్తిగా స్తంభించడం, పరీక్షలు దగ్గరగా ఉన్నప్పటికీ సెలవులివ్వకపోవడం. జరుగుతుంది. *ఉపాధ్యాయుడు పని చేయడు – దొంగ" అనే ప్రచారం ఎలా వచ్చింది?* ఇది అత్యంత ప్రమాదకరమైన సామాజిక దుష్ప్రచారం. రాజకీయంగా తప్పులను దాచేందుకు "టీచర్లే కారణం" అని ముద్ర వేయడం కొన్ని ఒంటరి తప్పిదాలను మొత్తం వృత్తికి అంటగట్టడం మీడియాలో ఉపాధ్యాయుల కష్టాలకన్నా లోపాలనే చూపించడం, ఇంటి పని, స్కూల్ పని, రికార్డులు, యాప్‌లు, మీటింగులు, పాఠశాల తర్వాత కూడా పిల్లల భవిష్యత్తుపై ఆలోచించే వృత్తి, తక్కువ జీతాలు, ఎక్కువ బాధ్యతలు, పని చేయని దొంగలు అయితే, సమాజంలో ఇంతమంది డాక్టర్లు, ఇంజనీర్లు ఎలా పుడుతున్నారు?ఉపాధ్యాయులపై ఈ వ్యవస్థకు ఎందుకు ఇంత విముఖత? ఇది ఒక్క కారణంతో కాదు, వ్యవస్థాత్మక సమస్య.

*ప్రభావం ఎవరి మీద పడుతుంది?* ఉపాధ్యాయులపై కాదు,విద్యార్థులపై ఉపాధ్యాయుడి ఆత్మగౌరవం పడితే బోధన ప్రభావం తగ్గుతుంది.బోధన తగ్గితే సమాజం అజ్ఞానంలోకి జారుతుంది.ఉపాధ్యాయుడిని అనుమానంతో చూడే వ్యవస్థ తన భవిష్యత్తునే అనుమానంలో పడేస్తుంది.ఫేషియల్ అటెండెన్స్ పర్యవేక్షణ కాదు,విశ్వాసం కావాలి. ఎలక్షన్ డ్యూటీలు పరిమితంగా ఉండాలి. ఉపాధ్యాయుడు దొంగ కాదు,సమాజ నిర్మాత. ఉపాధ్యాయునికి గౌరవం ఇచ్చిన రోజే విద్య వ్యవస్థకు నిజమైన పునాది పడుతుంది. *ప్రధాన కారణాలు* ఉపాధ్యాయుడు ప్రశ్నించే శక్తి కలవాడు,ఇది పాలకులకు ఇష్టం ఉండదు.విద్యను సేవగా కాకుండా ఖర్చుగా చూడడం ప్రైవేటీకరణకు అడ్డంకిగా ఉపాధ్యాయులు మారడం సంఘటితంగా మాట్లాడితే భయంగా మారుతుంది. --డా.ఓర్సు రాయలింగు 9849446027

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :