Friday, 31 July 2026 07:24:00 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

ప్రశాంతంగా మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

Date : 10 February 2026 07:35 PM Views : 189

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసామని ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సుల్తానాబాద్ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల డిస్ట్రిబ్యూషన్ సెంటర్, పెద్దపల్లి లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల డిస్ట్రిబ్యూషన్ సెంటర్, మంథనిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల డిస్ట్రిబ్యూషన్ సెంటర్, రామగుండం లోని సరస్వతి శిశు మందిర్ లో ఏర్పాటు చేసిన మున్సిపల్ ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను సందర్శించి ఎన్నికల సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ అర్బన్ లోకల్ బాడీస్ కు రెండవ సాధారణ ఎన్నికలు ఫిబ్రవరి 11న జరుగుతున్నాయని, మన జిల్లాలోని పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్ మున్సిపాలిటీలకు, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కు పోలింగ్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను సంబంధిత మున్సిపాలిటీలలో ఏర్పాటు చేశామని, ప్రతి చోట పోలింగ్ సిబ్బంది డిస్ట్రిబ్యూషన్ కేంద్రానికి చేరుకొని పోలింగ్ సామాగ్రిని ప్రశాంతంగా తీసుకుంటున్నట్లు తెలిపారు. రామగుండంలో ఏకగ్రీవమైన ఒక డివిజన్ మినహాయించి జిల్లాలోని మిగిలిన 123 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయని, సుమారు 470 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని, 407 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రం నందు వెబ్ క్యాస్టింగ్ నిర్వహిస్తున్నామన్నారు.

క్రిటికల్ పోలింగ్ కేంద్రాల బయట కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎన్నికల ప్రక్రియ పర్యవేక్షిస్తామని కలెక్టర్ తెలిపారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలలో పోలింగ్ సిబ్బంది అవసరమైన సామాగ్రి పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రశాంత ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) అరుణ శ్రీ, ఆర్డీవోలు గంగయ్య, సురేష్, మున్సిపల్ కమిషనర్లు వెంకటేష్, రమేష్, మనోహర్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :